నెల్లూరు జిల్లాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి - ఏపీ నేర వార్తలు
15:19 December 20
మరొకరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
ACCIDENT IN NELLORE : నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద.. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి మధ్యలోని.. గ్రీనరీని కట్ చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులు.. మన్నెటి కోట, చాగొల్లు, సింగరాయకొండ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: