ACCIDENT: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరుతోపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేటు బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులోని మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం... హిందూపురం, కర్ణాటక బాగేపల్లిలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రైవేటు బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని... పోలీసులు భావిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొన్నప్రైవేటు బస్సు.. ఒకరు మృతి - సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం
ACCIDENT: ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20మందికి గాయాలయ్యాయి.
ఆగి ఉన్న లారీని ఢీకొన్నప్రైవేటు బస్సు