Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.. గుత్తి పట్టణ శివారులో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 18 మందికి గాయాలయ్యాయి. చెరువు కట్ట సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మీదేవి అనే మహిళా కూలి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 18మందికి గాయాలు - Auto Accident of Farm Labourers
Road Accident: పొట్టకూటి కోసం ఆ వ్యవసాయ కూలీలు వేరే ప్రాంతానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి శివారులో ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందగా.. మరో 18 మందికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం
ప్రమాద ఘటన వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. వాహనాల రాకపోకలు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. క్షతగాత్రులు గుంతకల్ మండలం వైటీ చెరువు గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. పెద్దవడుగూరు మండలం కాసేపల్లి గ్రామానికి.. పత్తి తీయడానికి వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: