Teacher Beat Student In Nellore : నెల్లూరు జిల్లా నవాబ్పేటలోని రవీంద్రభారతి స్కూల్లో పనిచేస్తున్న ఓ టీచర్.. విద్యార్థిపై కర్కశంగా వ్యవహరించింది. హోం వర్క్ బుక్ తీసుకురాలేదని నాలుగో తరగతి చదువుతున్న ఆకాంక్ష్ను బెత్తంతో కొట్టింది. దీంతో బాలుడి ఎడమ కన్నుకు గాయం అయింది. రక్తం కారుతున్నా కనికరించని టీచర్ చికిత్స చేయకుండా.. సాయంత్రం వరకూ స్కూల్లోనే ఉంచారు. బాలుడిని ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు ఆకాంక్ష్ కంటి నుంచి రక్తం కారడం చూసి ఆందోళన చెందారు.
ప్రైవేట్ స్కూల్ టీచర్ కర్కశత్వం.. హోం వర్క్ బుక్ తీసుకురాలేదని.. - ap viral news
Teacher Beat Student : ఓ విద్యార్థిపై ప్రైవేట్ స్కూల్ టీచర్ కర్కశంగా వ్యవహరించింది. హోంవర్క్ బుక్ తీసుకురాలేదనే నెపంతో బెత్తంతో కొట్టింది. దీంతో బాలుడి ఎడమ కన్నుకి దెబ్బతగలడంతో తీవ్ర రక్తసావం అయ్యింది. అయినా కనికరించని ఆ టీచర్.. సాయంత్రం వరకు పిల్లాడిని స్కూల్లోనే ఉంచింది. బాలుడిని ఇంటికి తీసుకెళ్లడానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు.. బాలుడి కన్నుకు గాయం కావడాన్నిగుర్తించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. వారు ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు. గాయపడిన బాలుడిని తల్లి ఆసుపత్రికి తీసుకుపోయారు. కంటి లోపల తీవ్ర గాయం, రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారని ఆకాంక్ష్ తల్లి ఆశా తెలిపారు. అప్పటికీ కూడా రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం స్పందించలేదని వాపోయారు. అయితే ఈ ఘటనపై నెల్లూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తమది పేద కుటుంబం అని తమ బిడ్డకు కన్ను బాగు చేయించాలని ఆ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: