Loan App Frauds: లోన్‌యాప్‌ల ద్వారా మహిళలను మోసగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జాషూవా మాట్లాడుతూ.. లోన్‌యాప్ మోసాలకి సంబంధించి త్వరలోనే మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటామని ఆయన అన్నారు. పెనమలూరు, ఆత్కూరు స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా.. ఉన్నత అధికారుల ఆదేశాలతో ఏర్పాటుచేసిన బృందం ఇతర రాష్ట్రాలకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుందని తెలిపారు. ఈ కేసులతో సంబంధం ఉన్న ఇతర రాష్ట్రాలకి చెందిన మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
loan apps: "త్వరలో మరికొందరిని అదుపులోకి తీసుకుంటాం" - Krishna District
Loan Apps: లోన్‌యాప్‌ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఎక్కడంటే..?
కృష్ణా జిల్లా పోలీసులు
Last Updated : Sep 17, 2022, 8:16 PM IST