ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

జిమ్‌ ట్రైనర్‌పై పోలీసుల దాష్టీకం.. కర్రలతో కొట్టి.. కాళ్లతో తన్ని.. - జిమ్ ట్రైనర్​ను చితకబాదిన పోలీసులు

Police Beat Gym Trainer: సికింద్రాబాద్ మెట్టుగూడలో జిమ్ ట్రైనర్‌పై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ఇంటికి వచ్చి మరీ అతనిపై లాఠీ ఝుళిపించారు. ఏమైనా ఉంటే స్టేషన్‌కు ఉదయం వచ్చి మాట్లాడతానని అన్నందుకు లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జిమ్ ట్రైనర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విచక్షణా రహితంగా పోలీసులు కొట్టిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

gym-trainer
gym-trainer

By

Published : Jun 6, 2022, 2:09 PM IST

Police Beat Gym Trainer:సికింద్రాబాద్‌ పరిధిలోని మెట్టుగూడలో జిమ్‌ ట్రైనర్‌ ఆరోఖ్యరాజ్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారు. పెద్ద కర్రలతో ఇష్టారీతిన దాడికి పాల్పడటంతో జిమ్‌ ట్రైనర్‌కు కాలు విరిగింది. దీంతో అతడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. విచక్షణారహితంగా పోలీసులు దాడి చేసిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

జిమ్‌ ట్రైనర్‌పై పోలీసుల దాష్టీకం.. కర్రలతో కొట్టి.. కాళ్లతో తన్ని..

ఈనెల 3న బైక్‌ విషయంలో మరో వ్యక్తితో ఆరోఖ్యరాజ్‌కు చిన్న గొడవ జరిగింది. ఆ వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నలుగురు కానిస్టేబుళ్లు రాత్రి 11 గంటల సమయంలో ఆరోఖ్యరాజ్‌ వద్దకు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పారు. రాత్రి అయిందని.. ఉదయం వస్తానంటూ అతడు వారికి సమాధానమిచ్చాడు. దీంతో నలుగురు కానిస్టేబుళ్లు ఆరోఖ్యరాజ్‌పై దాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టి కాళ్లతో తన్నారు. తనను కొట్టొద్దంటూ అతడితో పాటు తల్లి ఎంత ప్రాధేయపడినా వినలేదు. కానిస్టేబుళ్ల దాడిలో బాధితుడికి శరీరమంతా గాయాలు కావడంతో పాటు కాలు విరిగింది. బస్తీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కానిస్టేబుళ్లు ఆరోఖ్యరాజ్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. స్థానికులే బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ తర్వాత పోలీసులే బేరసారాలకు వచ్చినట్లు బాధితుడు చెప్పారు. ఈ ఘటనను ఇక్కడితో వదిలేయాలని కోరినట్లు సమాచారం. ఆరోఖ్యరాజే ముందు తమపై దాడి చేసేందుకు యత్నించాడని.. తాము ప్రతిదాడి చేశామని కానిస్టేబుళ్లు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details