Maoist Dump At Andhra Odisha Border: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో పోలీసులు.. మావోయిస్టు భారీ డంప్‌ను గుర్తించారు. అండ్రహల్, సిందిపుట్, ఒండైపొదర్, ముదులిపడలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని గ్రామాల్లో పోలీసు బలగాలు జల్లెడ పడుతున్న సమయంలో మావోయిస్టుల డంప్ గుర్తించారు. ఈ డంప్‌లో 31 జిలెటిన్ స్టిక్స్, 11 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, రెండు టిఫిన్ బాంబులు, ఒక ప్రెసర్ కుక్కర్ బాంబ్ దొరికాయి. రూ.70వేల నగదు లభించిందని కోరాపుట్ ఎస్పీ వరుణ్ గుంటపళ్లి తెలిపారు.
ఏవోబీలో భారీ మావోయిస్ట్ డంప్ గుర్తింపు - కోరాపుట్
Maoist Dump: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో పోలీసులకు.. మావోయిస్టుల భారీ డంప్ లభ్యమైంది. ఇందులో భారీగా నగదు, పేలుడు పదార్థాలు గుర్తించారు.
Etv Bharat