Students facing problems: విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ కీచక ఉపాధ్యాయుడి ఆకృత్యాలు కృష్ణా జిల్లాలో వెలుగుచూశాయి. జిల్లాలోని ఉయ్యారు మండలం పెదఓగిరాల జిల్లా ఉన్నత పాఠశాలలో(teacher harass the students ) గణితం ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్న సాయిబాబు.. విద్యార్థినిలతో అసభ్యకరంగా(teacher misbehaved with students ) ప్రవర్తించడం వెలుగులోకి వచ్చింది. బాలికలనే స్పృహ లేకుండా తరగతి గదిలో తరచూ అసభ్య పదజాలంతో దూషించడం.. అవసరం లేకున్నా దగ్గరికి పిలిచి, ఎక్కడపడితే అక్కడ చేతులు వేయడం లాంటివి చేస్తాడని విద్యార్థినిలు వారి తల్లిదండ్రులకు తెలిపారు. విషయం(case file on teacher) తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఆ ఉపాధ్యాయుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాఠాలు చెప్పకుండా పాడు పనులు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు - ఏపీ నేర వార్తలు
Teacher misconduct with Students: తల్లిదండ్రుల తర్వాత ప్రత్యేకమైన(teacher obscene with students) స్థానం కలిగిన వ్యక్తి గురువు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది.. వారిని శిఖరాగ్రాలంచున నిలపగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. అటువంటి ఓ గురువు.. విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థినిలతో వికృతంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది.
పెద ఓగిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని గణిత ఉపాధ్యాయుడు సాయిబాబుపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఎంఈఓ కనకమహాలక్ష్మి విచారణ చేపట్టి.. విద్యార్థుల తల్లిదండ్రుల(teacher misbehaved with students in krishna) వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం పాఠశాలలోని సమస్యలపై కూడా అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నిందితుడైన గణిత ఉపాధ్యాయుడు సాయిబాబుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: