ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రకాశం జిల్లాలో భారీ దొంగతనం.. 50 సవర్ల బంగారం అపహరణ

ప్రకాశం జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. చీరాల మండలంలోని ఈపూరుపాలెంలోని ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By

Published : Feb 13, 2021, 7:12 PM IST

Published : Feb 13, 2021, 7:12 PM IST

Massive theft in Prakasam district
ప్రకాశం జిల్లాలో భారీ దొంగతనం.. 50 సవర్ల బంగారం అపహరణ

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలో జయరాం అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రాత్రిపూట ఇంట్లోకి చొరబడిన దొంగలు 50 సవర్ల బంగారం, ఐదు కేజీల వెండి, రెండు లక్షల నగదు దోచుకెళ్లారు.

గ్రామానికి చెందిన జయరాం తన తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో గుంటూరు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చేర్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు రాత్రి ఆసుపత్రిలో ఉన్నారు. ఉదయం తలువులు తీసి ఉండటాన్ని గమనించిన స్థానికులు జయరాం​కు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్ళేసరికి బీరువా పగులగొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉండాల్సిన సుమారు 50 సవర్ల బంగారు అభరణాలు, ఐదు కేజీల వెండి, రెండు లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు గుర్తించాడు. చీరాల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:ఎన్నికల విధుల్లో వీఆర్​ఏ మృతి

ABOUT THE AUTHOR

...view details