ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

MURDER: ఇద్దరి మధ్య గొడవ.. మధ్యలో వెళ్లిన వ్యక్తి హత్య! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

MURDER: ఒకతను మద్యం మత్తులో మరో వ్యక్తి దగ్గరికి వెళ్లి ఫోన్ మాట్లాడాలి.. కాస్తా మీ ఫోన్ ఇవ్వండని అడిగాడు. అతను ఫోన్ ఇచ్చాడు. తిరిగి ఇచ్చే క్రమంలో ఫోన్ కవర్లో దాచుకున్న డబ్బులు కనిపించలేదు. దాంతో.. ఇరువురి మధ్య మొదలైన వివాదం.. చినికి చినికి గాలివానగా మారింది. అయితే.. ఈ గొడవకు సంబంధంలేని వ్యక్తి బలైపోయాడు..!

MURDER
సర్ది చెప్పడానికి వచ్చాడు కానీ.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు

By

Published : May 26, 2022, 12:41 PM IST

MURDER: చిన్న విషయం పెద్ద వివాదానికి దారి తీసి.. ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పుల్లలచెరువు మండల కేంద్రంలోని ఎస్సీపాలెంలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బడిపాటి నవీన్ అనే వ్యక్తి మద్యం మత్తులో గ్లాడ్సన్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి ఫోన్ కావాలి.. కాల్ చేసుకొని ఇస్తానని చెప్పగా.. గ్లాడ్సన్ తన ఫోన్ ఇచ్చాడు. అయితే.. నవీన్ తిరిగి ఇచ్చిన తర్వాత తన ఫోన్ కవర్లో దాచుకున్న రూ.500 నోటు కనిపించలేదు. దీంతో.. డబ్బుల విషయమై గ్లాడ్సన్ నవీన్​ను ప్రశ్నించాడు.

దీంతో.. ఇరువురి మధ్య ఈ విషయమై వాగ్వాదం మొదలైంది. చినికి చినికి గాలివానగా మారి, అది ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న గ్లాడ్సన్ బంధువులైన రావూరి ఆశీర్వాదం, ఆనందరావు వెళ్లి మాట్లాడుతున్న సమయంలో.. నవీన్ కత్తితో వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ఆశీర్వాదం మృతిచెందాడు. ఆనందరావును మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. సమాచారం అందుకున్న యర్రగొండపాలెెం సీఐ ఘటనా స్థలికి చేరుకొని హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details