ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

SUISIDE:'ఐయామ్‌ సో బ్యాడ్‌ డాటర్‌.. మిస్‌ యూ నాన్న.. అమ్మ' - హెచ్​సీయూ వార్తలు

తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన మౌనిక హెచ్​సీయూలో ఎంటెక్‌- నానో టెక్నాలజీ రెండో సంవత్సరం విద్యార్థిని. సోమవారం కిటికీ చువ్వకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

SUISIDE
ఆత్మహత్య

By

Published : Aug 24, 2021, 10:30 AM IST

"ఐయామ్‌ సో బ్యాడ్‌ డాటర్‌.. మిస్‌ యూ నాన్న.. అమ్మ"అని సూసైడ్‌ నోట్‌ రాసి తెలంగాణలోని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంటెక్‌ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కుమార్తె ఆర్‌.మౌనిక (27) హెచ్‌సీయూలో ఎంటెక్‌- నానో టెక్నాలజీ రెండో సంవత్సరం విద్యార్థిని. క్యాంపస్‌లోని మహిళా వసతి గృహం-7లో ఉంటోంది.

సోమవారం ఉదయం నుంచి గదిలోంచి బయటకు రాలేదు. తోటి విద్యార్థులు వెళ్లి పిలిచినా స్పందన లేదు. వెంటిలేటర్‌లోంచి చూడగా కిటికీ చువ్వకు ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎంటెక్‌ విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించిన అనంతరం.. ఈనెల 18వ తేదీన హాస్టల్‌ గదికి వచ్చి ఉంటోంది. ఆమె తండ్రి లచ్చయ్య గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటారు. పదో తరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన తర్వాత మౌనికకు బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని హెచ్‌సీయూలో ఎంటెక్‌లో చేరింది. ఇలా.. అర్థంతరంగా తనువు చాలించింది.

ABOUT THE AUTHOR

...view details