ACCIDENT IN GHAT ROAD:కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు మృతి చెందారు. పోలీసులు వివరాల మేరకు.. బెంగళూరు నుంచి గుంటూరుకు రొయ్యల దాన బస్తాలు తీసుకెళ్తున్న లారీ రాత్రి 10 గంటలకు గువ్వల చెరువుకు చేరింది. ఘాట్ రోడ్‌లోని నాలుగో మలుపు వద్దకు రాగానే.. లారీ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. దాదాపు వంద అడుగుల లోతులోకి లారీ దూసుకెళ్లడంతో.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్యాబిన్లో చిక్కుకున్న క్లీనర్‌ను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. లారీ నుంచి అతికష్టం మీద మృతదేహాన్ని పోలీసులు పైకి తీసుకొచ్చారు.
ACCIDENT IN GHAT ROAD: గువ్వల చెరువు ఘాట్ రోడ్‌లో ప్రమాదం.. ఇద్దరు మృతి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
ACCIDENT IN GHAT ROAD: కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు మృతి చెందారు. బెంగుళూరు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ACCIDENT IN GHAT ROAD