ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Life Imprisonment: కుక్క తెచ్చిన తంటా.. ముగ్గురికి జీవిత ఖైదు - కుక్కు వివాదం

Life Imprisonment: గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో..! ఓ కుక్క కారణంగా తలెత్తిన వివాదం నాలుగు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. కుక్క పొరుగింట్లోకి వెళ్లిందనే కారణంతో తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. ఈ కేసులో ఏడేళ్ల తర్వాత ముగ్గురికి జీవిత ఖైదు వేస్తూ.. న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

hyderabad crime
hyderabad crime

By

Published : Dec 11, 2021, 1:39 PM IST

Life Imprisonment: తెలంగాణలోని పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామపంచాయతీ రామేశ్వరం వీకర్‌ సెక్షన్‌ కాలనీలో.. ప్రశాంత్‌ అనే వ్యక్తి కుక్కను పెంచుకునేవాడు. జాగిలం కాస్తా.. పొరిగింట్లో ఉన్న శ్రీనివాస్​ ఇంట్లోకి వెళ్లింది. అతను దాన్ని కొట్టడంతో ప్రశాంత్-శ్రీనివాస్​ మధ్య వివాదం రేగింది. కక్ష పెంచుకున్న ప్రశాంత్‌.. రామచంద్రాపురం బొంబాయి కాలనీకి చెందిన ప్రకాశ్‌, వినోద్‌లతో కలిసి అర్ధరాత్రి వెళ్లి శ్రీనివాస్‌ను కొట్టి హత్య చేశారు. అడ్డొచ్చిన ఆయన భార్య రేణుకపై కూడా హత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై 2014లో పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి సంగారెడ్డి రెండో అడిషనల్‌ జిల్లా కోర్టులో హాజరు పర్చారు. బాధితుల తరఫున పీపీ మహబూబ్‌ అలీ వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి అనిత దాదాపు ఏడేళ్ల తర్వాత శుక్రవారం తీర్పు చెప్పారు. ముగ్గురికి జీవితఖైదుతోపాటు రూ.5,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఇదీ చూడండి:

Crime News: తన భర్తతో సంబంధం పెట్టుకుందని..ఆమె ఏం చేసిందంటే..!

ABOUT THE AUTHOR

...view details