VRA murder in telangana: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దుర్గం బాబు హత్యకు గురయ్యాడు. కార్యాలయ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
VRA Murder: ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్ఏ హత్య..! - కన్నెపల్లిలో వీఆర్ఏ మర్డర్
VRA murder in telangana: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో దారుణం జరిగింది. తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దుర్గం బాబు హత్యకు గురయ్యాడు. కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం తెరవడానికి వచ్చిన సిబ్బంది.. దుర్గంబాబును చూసి షాకయ్యారు.
కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం తెరవడానికి వచ్చిన సిబ్బంది.. ఆఫీసులో ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉండటం గమనించి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి వీఆర్ఏ దుర్గం బాబుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని అతణ్ని ఎవరు హత్య చేసుంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దుర్గం బాబు గురించి కార్యాలయ సిబ్బందిని ఆరా తీశారు. అతనికి ఎవరితో అయినా గొడవలున్నాయా అని ప్రశ్నించారు. దుర్గం బాబు కొత్తపల్లి వీఆర్ఏగా పని చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి :