ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Kidnap Case: సాయం పేరుతో చిన్నారి కిడ్నాప్... కాపాడిన పోలీసులు

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పాతబస్తీ కంచన్​బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్​న​కు గురైన ఆరు సంవత్సరాల పాపను కంచన్​బాగ్ పోలీసులు సురక్షితంగా కాపాడారు. వీరికి సాయం చేసిన సంతోష్​నగర్ పోలీసులను దక్షిణ మండల డీసీపీ గజరావు అభినందించారు.

Kidnap Case
Kidnap Case

By

Published : Sep 14, 2021, 9:27 PM IST

ఆరు సంవత్సరాల చిన్నారి కిడ్నాప్​ కేసు (Kidnap Case)ను తెలంగాణ రాష్ట్రంలోని కంచన్​బాగ్ పోలీసులు (Kanchanbhag Police) ఛేదించారు. చిన్నారిని సురక్షితంగా కాపాడి పాప తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్ పాతబస్తీ కంచన్​బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్ ప్రాంతంలో ఆరు సంవత్సరాల వయసున్న అల్ఫియాను ఓ మహిళ ఆటోలో తీసుకొని పారిపోయింది. బాధిత తల్లి కంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన కంచన్​బాగ్ పోలీసులు.. సంతోష్​​నగర్ డివిజన్ పోలీసుల సహాయంతో ఈరోజు తెల్లవారు జామున షాద్​నగర్ ప్రాంతంలో నిందితురాలిని అదుపులోకి తీసుకొని చిన్నారిని సురక్షితంగా రక్షించారు.

సాయం ఆశ చూపి...

అంబర్​పేట ప్రాంతానికి చెందిన ముస్కాన్ భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఈమెకు ఆరు సంవత్సరాల కూతురు అల్ఫియా ఉంది. సోమవారం చంచల్​గూడ సిగ్నల్ వద్ద భిక్షాటన చేసుకుంటుండగా.. ఓ మహిళ ఆమె వద్దకు వచ్చింది. తన పేరు ఫాతిమాగా పరిచయం చేసుకుని... తనకు తెలిసినవారు బాబానగర్ ప్రాంతంలో పేదవారికి ఆర్థిక సహాయం చేస్తున్నారని నమ్మబలికింది. తల్లి కూతురును ఆటోలో బాబానగర్ ప్రాంతానికి తీసుకెళ్లింది. ఓ ఇంటి గేట్ చూపించి తల్లిని వెళ్లమని పంపింది. పాప తల్లి ఇంట్లోకి వెళ్లగానే సదురు మహిళ చిన్నారిని తీసుకొని ఉడాయించింది.

చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితురాలు ఆసియాబీని షాద్​నగర్​లో అదుపులోకి తీసుకుని చిన్నారిని రక్షించారు. కేసును ఛేదించిన సంతోశ్​ నగర్ డివిజన్ పోలీసులను దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ అభినందించారు.

ఇదీ చదవండి:

REWARD ON ACCUSED: హత్యాచార నిందితుడిని పట్టిస్తే రూ. 10 లక్షలు

ABOUT THE AUTHOR

...view details