ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

HUSBAND MURDERED HIS WIFE: పిల్లలు చూస్తుండగానే దారుణం! - ap 2021 news

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని ద్వారకా నగర్​లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో.. భర్త ఆమెను హత్య చేశాడు. పిల్లలు చూస్తుండగానే ఈ ఘోరానికి పాల్పడ్డాడు.

husband-brutally-murdered-his-wife-at-chittor
కట్టుకున్న భార్య పాలిట కాలయముడైన భర్త

By

Published : Oct 24, 2021, 12:09 PM IST

చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం ద్వారకా నగర్​ కు చెందిన.. సురేష్, శాంతి దంపతులు. వీరికి కౌశిక్(4) మౌనిక(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భర్త సురేష్.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. శనివారం రాత్రి ఈ విషయంపై భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన సురేష్.. భార్యను దారుణంగా హత్య చేసి పారిపోయాడు.

పిల్లలు చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు సురేష్. తమ కళ్ల ముందే తల్లిని చంపడం చూసిన పిల్లలు భయంతో గజగజవణికిపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని.. శాంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:
చెక్కుల దొంగ దొరికాడు.. అకౌంట్ సెటిల్ చేశారు!

ABOUT THE AUTHOR

...view details