Gang Rape on Minor Girl: హైదరాబాద్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే సికింద్రాబాద్ పరిధిలో మైనర్‌పై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానా పీఎస్ పరిధిలోని లాడ్జిలలో వేర్వేరు రోజుల్లో బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను, లాడ్జి నిర్వాహకులను అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మరో దారుణం... వేర్వేరు రోజుల్లో.. బాలికపై ఐదుగురు అత్యాచారం - బాలికపై గ్యాంగ్ రేప్
Gang Rape on Minor Girl: జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే సికింద్రాబాద్ పరిధిలో మైనర్‌పై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానా పరిధిలోని ఓ లాడ్జిలో బాలికపై ఐదుగురు యువకులు వేర్వేరు రోజుల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను, లాడ్జి నిర్వాహకులను అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలికతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్న నిందితులు... మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు. స్నేహం పేరుతో బాలికను ఆ యువకులు మభ్యపెట్టారు. వేర్వేరు రోజుల్లో ఆ ఐదుగురు లైంగిక వాంఛ తీర్చుకున్నారు. లాడ్జిల్లో వేర్వేరు రోజుల్లో ఆ యువకులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. బాలిక తండ్రి విజ్ఞప్తి మేరకు గోప్యంగా విచారణ జరిపారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు మే 30న కేసు నమోదు చేసిన పోలీసులు... అత్యాచారం చేసిన ఐదుగురు యువకులు, ఇద్దరు లాడ్జ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
ఇవీ చదవండి: