Arrest: గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన తిర్లిక శ్రీనివాసరావు 12 ఏళ్లుగా బంగారం వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోయాడు. సులువుగా డబ్బు సంపాందించే లక్ష్యంతో ప్రకాశం జిల్లాలోని తన స్నేహితులతో కలిసి దొంగతనాలకు పాల్పడ్డాడు. తాజాగా ఈ ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.88 లక్షల నగదుతో పాటు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట నుంచి బంగారం కోసం ఈ నెల తొమ్మిదిన చెన్నై వెళ్తున్న ఓ వ్యాపారి సహాయకుడి నుంచి 90 లక్షల రూపాయలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు.
వ్యాపారం చెడి.. దొంగతనాలకు పాల్పడి.. చివరకు
Gang Arrest: అతడు 12 సంవత్సరాల పాటు బంగారం వ్యాపారం చేశాడు. ఒకరోజు చెన్నై నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారు కడ్డీలతో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. దీంతో వ్యాపారం కుంటుపడింది. చేతిలో రూపాయి సంపాదన లేదు. డబ్బు కోసం అతని స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే ఓ వ్యాపారి నుంచి భారీ మొత్తంలో సొమ్మును దోచుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే?
దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్