ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Fraud: వట్టిచెరుకూరులో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట.. సిటిజన్ సంస్థ మోసం!

By

Published : Oct 10, 2021, 7:51 AM IST

Updated : Oct 10, 2021, 3:08 PM IST

fraud in housing
fraud in housing

07:48 October 10

వట్టిచెరుకూరులో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట మోసం..

వట్టిచెరుకూరులో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట మోసం..

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో సిటిజన్ సంస్థ గృహ నిర్మాణాలు చేపడతామని చెప్పి రూ. 8 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు భాదితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్థానిక జడ్పీటీసీ వెంకట లక్ష్మీ సూచన మేరకు ఇచ్చామని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 20 మంది దగ్గర రూ. 40 వేలు చొప్పున నగదు వసూలు చేసుకెళ్లి ఇళ్ల నిర్మాణం చేయకుండా...నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితులు వాపోయారు. జడ్పీటీసీ లక్ష్మీ దృష్టికి విషయాన్ని భాదితులు తీసుకెళ్లగా...పోలీసులకు పిర్యాదు చేయాలని సూచన ఇచ్చారని, అందుకే పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేసినట్లు భాదితులు చెప్పారు.
సిటిజన్ సంస్థ ప్రతినిధులు గృహాలు నిర్మిస్తామని రూ. 8 లక్షలు వసూలు చేసిన మాట వాస్తవమేనని జడ్పీటీసీ వెంకటలక్ష్మి తెలిపారు. నగదు చెల్లించే విషయంలో తనకు సంబంధం లేదని గ్రామస్థులకు చెప్పినా...మధ్యవర్తిగా ఉండాలని భాదితులు కోరినట్లు చెప్పారు. భాదితులకు నగదు చెల్లించాలని రెండు నెలల క్రితం సంస్థ ప్రతినిధులకు చెప్పినా వారు ఇవ్వలేదన్నారు. అనంతరం మీడియా ముందు సంస్థ ప్రతినిధులతో ఆమె ఫోన్ లో మాట్లాడారు. నగదు తీసుకున్నామని...జడ్పీటీసీకి ఎలాంటి సంబంధం లేదని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ నెల 25 నగదు ఇస్తామని చెప్పగా...అలా కుదరదని వెంటనే వట్టిచెరుకూరు వచ్చి బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పారు. అనంతరం సిటిజన్ సంస్థ పై పోలీసులకు జడ్పీటీసీ లక్ష్మీ ఫిర్యాదు చేశారు.

KRMB, GRMB: ప్రాజెక్టుల స్వాధీనం సాధ్యమేనా? తెలుగు రాష్ట్రాలు అంగీకరించేనా?

Last Updated : Oct 10, 2021, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details