ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

రంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి - four children died after falling into a pond

four children died: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

four children died after falling into a pond
four children died after falling into a pond

By

Published : Oct 2, 2022, 4:04 PM IST

four children died after falling into a pond: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాడిపర్తిలో తీవ్ర విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. మృతులు తాటిపర్తికి చెందిన అబ్దుల్ రహీమ్‌ కుటుంబసభ్యులుగా గుర్తించారు. దసరా సెలవులు కావడంతో పిల్లలు సరదాగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యాలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. మృతులంతా 15 ఏళ్లలోపు చిన్నారులు. వారిలో ముగ్గురు బాలురు, బాలిక ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details