Casino: చీకోటి ప్రవీణ్ ఫాంహౌస్‌లో అటవి, విజిలెన్స్ అధికారుల తనిఖీలు - casino issue in hyderabad
Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన చీకోటి ప్రవీణ్ ఆస్తులపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 20 ఎకరాల్లో ఉన్న ఫాంహౌస్‌లో అటవి, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫాంహౌస్‌లో మాట్లాడే రామచిలుకలు, ఊసరవెల్లులు, బల్లులు, ఆస్ట్రిచ్, గుర్రాలు, కుక్కలు, ఆవులు, ఉడుములతో పాటు పురాతన రథం, సింహాల ఇత్తడి విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో జంతు అక్రమ రవాణా నియంత్రణ అధికారులు కూడా పాల్గొన్నారు.
chikoti praveen