ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా భయంతో వృద్ధ దంపతుల బలవన్మరణం?

By

Published : Apr 16, 2021, 7:24 AM IST

కరోనా సోకిన వృద్ధ దంపతులు తమ పిల్లలకు భారం కాకూడదు అనుకున్నారు. ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతలోనే ఏమైందో .. సాయంత్రం వేళ వారిద్దరి మృతదేహాలను కాలువలో గుర్తించారు.

Forced death
Forced death

తమ పిల్లలకు భారం కాకూడదనే భావనతో కరోనా సోకిన వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. స్థానికులైన కర్రి వెంకటరెడ్డి(71), సావిత్రి(64)లకు ఈనెల 12న కొవిడ్‌ సోకింది. ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వారిద్దరి కుమారుల్లో ఒకరు రాజమహేంద్రవరంలో, మరొకరు ఒడిశాలోని జైపూర్‌లో ఉంటున్నారు. ఉదయం ఇంట్లో దంపతుల అలికిడి లేకపోవడాన్ని గుర్తించిన సమీప బంధువులు రాజమహేంద్రవరంలోని కుమారుడికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న కుమారుడు పరిసర ప్రాంతాల్లో గాలించారు. సాయంత్రం వేళ వారిద్దరి మృతదేహాలను స్థానిక మండపేట కాలువలో గుర్తించారు.

ఇదీ చదవండి:కిరాతకం: 20 నిమిషాల్లో ఆరుగురిని తెగనరికాడు

ABOUT THE AUTHOR

...view details