ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Suicide : ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య - medchal district crime news

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ మేడ్చల్‌ జిల్లా కీసరలో జరిగింది. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి, అక్షిత దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Family commits suicide in Medchal district
ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

By

Published : Jun 4, 2021, 12:51 PM IST

Updated : Jun 4, 2021, 1:28 PM IST

మేడ్చల్‌ జిల్లా కీసర పరిధిలో కలహాలతో ఓ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి, అక్షిత దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి.. కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ చేరుకున్నారు. నాగారం మున్సిపాలిటీ.. వెస్ట్‌గాంధీ నగర్‌లో నివాసముంటున్నారు.

ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు.... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి సూసైడ్‌ నోట్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

  • ఇదీ చదవండి :

పదకొండు శాతం మేర పడిపోయిన ఆక్వా ఎగుమతులు

Last Updated : Jun 4, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details