ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

పిల్లలను కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ మహిళను ప్రకాశం జిల్లా ఈపురూపాలెం పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి పిల్లలతో కలిసి వెళ్లిపోయినట్లు మహిళ కుటుంబసభ్యులు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాడరేవులో ఉన్నట్లు గుర్తించి.. ఈపురుపాలెం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని వారిని రక్షించారు.

epurupalem  police
epurupalem police

By

Published : Jul 27, 2021, 6:24 PM IST

ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన ఓ తల్లీ, ఇద్దరు చిన్నారులను ప్రకాశం జిల్లా ఈపురూపాలెం పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాలతో ఒంగోలు నగరంలోని శ్రీనివాసకాలనికి చెందిన అనురూప ఇద్దరు చిన్నారులతో చీరాల మండలం వాడరేవుకు చేరింది. ఇంట్లో నుంచి అనురూప వెళ్లిపోయిందని ఆమె కుటుంబసభ్యులు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాడరేవులో ఉన్నట్లు గుర్తించారు.. వెంటనే ఈపురుపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్సై సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లి ఆమెను, పిల్లలను గుర్తించి ఈపురుపాలెం పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. అనంతరం వారిని ఒంగోలు పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తల్లి, పిల్లలను కాపాడిన ఈపురుపాలెం ఎస్సై సుబ్బారావును, స్టేషన్ సిబ్బందిని పోలీసు అధికారులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details