MURDER CASE: రాహుల్ హత్య కేసు..పోలీసుల అదుపులో పాత నేరస్థులు - andhra pradesh news updates
11:28 August 21
రాహుల్ హత్య కేసు
విజయవాడలో హత్యకు గురైన రాహుల్ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో పోలీసులు పాత నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. శ్యామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో హత్యకు గురైన వ్యాపారి రాంప్రసాద్ కేసులోనూ శ్యామ్ నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు హత్య సమయంలో అక్కడే ఉన్నాడని భావిస్తున్న కోరాడ విజయ్‌కుమార్ కోసం గాలిస్తుండగా.. అతని అనుచరులను విచారిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో కీలక నిందితుడు విజయ్‌కుమార్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. హత్య జరిగినప్పుడు కోరాడ విజయ్‌కుమార్ ప్రత్యక్షంగా ఉన్నాడని భావిస్తున్న పోలీసులు.. అతని కోసం బెంగళూరు, విశాఖ, హైదరాబాద్‌లో ప్రత్యేక బృందాలతో వెతుకులాట కొనసాగిస్తున్నారు. కోరాడ అనుచరులను కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: RAHUL MURDER CASE : రాహుల్ హత్య కేసు... కీలక నిందితుల కోసం గాలింపు