Two persons Killed in Nellore: నెల్లూరులో గత నెలలో జరిగిన జంట హత్యలు నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఆ ఘటనను మరవకముందే మళ్లీ జంట హత్యలు కలకలం రేపాయి. నెల్లూరు రూరల్ మండల డైకాస్ రోడ్డు సెంటర్ టైలర్స్ కాలనీలో రమణారెడ్డి, శ్రీకాంత్ అనే వ్యక్తులు మద్యం సేవిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో వచ్చి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Double Murder: నెల్లూరులో కలకలం.. ఇద్దరు దారుణహత్య - Double Murder
Double murder in Nellore: నెల్లూరు జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యలు నగర ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. దంపతుల జంట హత్య మరవకముందే మరో దారుణం జరిగింది. టైలర్స్ కాలనీలో ఇద్దరు వ్యక్తులను ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. రమణారెడ్డి, శ్రీకాంత్‌లు టైలర్స్ కాలనీ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అక్కడికి గుర్తుతెలియని వ్యక్తి ఆటోలో వచ్చి.. రమణారెడ్డి, శ్రీకాంత్‌లపై దాడి చేశాడు. అనంతరం కత్తితో ఇద్దరినీ కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న వేదాయపాలెం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే మృతి చెందిన రమణారెడ్డి, శ్రీకాంత్‌ల మృతదేహాలను నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి ఎవరో.. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హంతకుని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ జంట హత్యలు స్థానికులలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. వారి ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.
ఇవీ చదవండి: