సైబర్ నేరస్థుల బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. చిన్న చిన్న ప్రలోభాలకు లొంగి సైబర్ వలలకు చిక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఇద్దరు బాధితులు సైబర్ వలకు చిక్కారు. వారికి తెలియకుండానే తమ ఖాతాల్లోని నగదు మాయమైందంటూ పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్కి చెందిన తులసి బాబు అనే వ్యక్తి తన ఖాతా నుంచి రూ.4 లక్షలు పోయాయని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా.. వెంకటేశ్ అనే మరో వ్యక్తి తన భార్య అకౌంట్లో నుంచి 4.49 లక్షలు కాజేశారని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.