ఆంధ్రప్రదేశ్

andhra pradesh

pub case: "కస్టమర్లే ఎవరో పడేశారు" అన్న నిందితులు.. పబ్ కేసులో ముగిసిన కస్టడీ!!

By

Published : Apr 18, 2022, 7:09 AM IST

Hyderabad Pub Case: తెలంగాణలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితులకు కస్టడీ ముగిసింది. నిందితులు అభిషేక్, అనిల్‌ను 4 రోజులపాటు పోలీసులు ప్రశ్నించారు. పబ్​లో పోలీసులకు లభ్యమైన కొకైన్​కు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు తెలిపారు.

Hyderabad Pub Case
తెలంగాణ పబ్ కేసులో ముగిసిన కస్టడీ

Hyderabad Pub Case: తెలంగాణలోని బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఈనెల 14న నిందితులు అభిషేక్, అనిల్​ను చంచల్ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఠాణాకు తీసుకువచ్చిన పోలీసులు.. వివిధ కోణాల్లో ప్రశ్నించారు. పబ్​లో పోలీసులకు లభ్యమైన కొకైన్​కు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు చెబుతున్నారు. అభిషేక్ ఐ ఫోన్​లో కీలక డేటా ఉంటుందని భావించిన పోలీసులు.. దర్యాప్తులో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలను, ఫోన్ కాల్స్​ను, వాట్సాప్ సందేశాలను గుర్తించలేదు.

పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగిన నిందితులు నోరు మెదపడం లేదు. పబ్​లో స్వాధీనం చేసుకున్న 4.64 గ్రాముల కొకైన్​కు తమకు ఏమీ తెలియదని చెబుతున్నారు. పోలీసులు రైడ్ చేస్తున్నారు అన్న సమాచారంతో కస్టమర్లు ఎవరో పడేశారని బదులిస్తున్నారు. తమకు కస్టమర్లకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకు మాత్రమే పామ్ అనే సాఫ్ట్​వేర్​ వాడినట్టు అభిషేక్ పోలీసులకు తెలిపాడు.

ఆ రోజు రాత్రి పార్టీకి ఎక్కువ మంది కస్టమర్స్ రావడం వాస్తవమని.. కానీ తాము ఎవరికి డ్రగ్స్ సరఫరా చేయలేదని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఏ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరగలేదని అభిషేక్ పోలీసులకు వివరించాడు. కస్టడీ ముగియడంతో రేపు ఉదయం వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి.. తిరిగి చంచల్​గూడ జైలుకు తరలించనున్నారు. కేసులో మరింత సమాచారం సేకరించేందుకు అభిషేక్​ను మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details