ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ATTACK: శ్రీపర్రులో ఉద్రిక్తత.. తెదేపా నాయకుడు గోవర్ధన్‌ ఇంటి వద్ద చాటపర్రు గ్రామస్థుల హల్‌చల్‌ - ఏలూరు జిల్లా తాజా వార్తలు

ATTACK: ఏలూరు మండల పరిధిలోని శ్రీపర్రు గ్రామంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొల్లేరు అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై శ్రీపర్రు గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు సైదు గోవర్ధన్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పలు ఆరోపణలు చేశారు.

attack
attack

By

Published : Jun 22, 2022, 8:40 AM IST

ATTACK: ఏలూరు మండల పరిధిలోని శ్రీపర్రు గ్రామంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని కొల్లేరు అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై శ్రీపర్రు గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు సైదు గోవర్ధన్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పలు ఆరోపణలు చేశారు. మాధవాపురం సమీపంలో చాటపర్రుకు చెందిన పలువురు అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారని ఆయన కుమారుడు సోమవారం ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చాటపర్రు గ్రామానికి చెందిన కొందరు ఆటోల్లో మంగళవారం మాదేపల్లిలోని గోవర్ధన్‌ ఇంటికి చేరుకున్నారు.

ఆ సమయంలో ఆయన శ్రీపర్రులోని బంధువుల ఇంటికి వెళ్లడంతో వారంతా అక్కడికి చేరుకొని కొద్దిసేపు హల్‌చల్‌ చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఏలూరు గ్రామీణ పోలీసులు అక్కడికి వెళ్లి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నందువల్లే తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నారని, వైకాపా నాయకులే రెచ్చగొట్టి తన ఇంటి మీదకు పంపించారని గోవర్ధన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. తమకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత వైకాపా నాయకులు, పోలీసులదేనన్నారు. కాగా, ఈ ఘటనపై గోవర్ధన్‌ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details