Case on Shaik Riyaz Basha: గుంటూరు జిల్లా తాడికొండలో రౌడీషీటర్ షేక్ రియాజ్ బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జూనియర్ కళాశాలకు వెళ్లి మద్యం తాగి.. విద్యార్థినులతో రియాజ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆడపిల్లల వెంటపడి అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు రౌడీషీటర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న రియాజ్... స్టేషన్లో వీరంగం సృష్టించాడు. పోలీసు ఉన్నతాధికారులను నోటికొచ్చినట్లు దుర్భాషలాడాడు. రియాజ్ బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు.