ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

suspects abscond: లాకప్‌ నుంచి గంజాయి రవాణా నిందితులు పరారీ - telugu news

Cannabis trafficking suspects abscond: తూర్పుగోదావరి జిల్లా తాళ్లూరు సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించి లాకప్​లో ఉంచారు. లాకప్ సెల్ బలహానంగా ఉండటంతో... నిందితులు పరారయ్యారు.

Cannabis smuggling suspects fleeing lockup
లాకప్‌ నుంచి పరారైన గంజాయి రవాణా నిందితులు

By

Published : Dec 4, 2021, 9:37 AM IST

Cannabis trafficking suspects abscond: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు. గురువారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు సమీపంలో 6 కేజీల గంజాయితో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు కారులో వెళ్తున్న మహ్మద్‌ బాద్‌షా (36), కరీం (31), మహ్మద్‌ తన్షీర్‌ (24)లను గండేపల్లి ఎస్సై శోభన్‌కుమార్‌ అదుపులోకి తీసుకున్నారు.

గండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌ లేకపోవడంతో వీరిని జగ్గంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి లాకప్‌లో ఉంచారు. వీరు పోలీసుల కళ్లుగప్పి శుక్రవారం ఉదయం పరారయ్యారు. లాకప్‌ (సెల్‌) వెనుకభాగం బలహీనంగా ఉండటాన్ని గమనించిన నిందితులు.. అటువైపు నుంచి పరారైనట్లు జగ్గంపేట ఎస్సై లక్ష్మి తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details