Machareddy Accident: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘన్‌పూర్(ఎం) వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్-1 డిపో బస్సు కామారెడ్డికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయినట్లు చెప్పారు.
Accident: కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి - తెలంగాణ మాచారెడ్డిలో ప్రమాదం
Machareddy Accident: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘన్‌పూర్(ఎం) వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మరణించగా.. మరొకరు గాయపడ్డారు.
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి
కారులో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు గుర్తించారు. మరో బాలిక తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. బస్సు టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :
Last Updated : Mar 28, 2022, 12:39 PM IST