ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BOOBY TRAP: పోలీసులపై దాడులే లక్ష్యం.. మావోయిస్టుల కొత్త ప్లాన్​

పోలీసులపై వ్యూహాత్మక దాడులే లక్ష్యంగా మావోయిస్టులు బూబీ ట్రాప్​లను అమర్చారు. ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్​ బలగాలు బూబీ ట్రాప్​లను కనిపెట్టాయి.

By

Published : Oct 9, 2021, 1:54 PM IST

Published : Oct 9, 2021, 1:54 PM IST

booby-traps-in-the-mallampeta-forest-area
పోలీసులపై దాడులే లక్ష్యంగా బూబీ ట్రాప్​లు.. ధ్వంసం చేసిన పోలీసు బలగాలు

ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో కూంబింగ్ బలగాలు బూబీ ట్రాప్​లను గుర్తించారు. పోలీసులపై దాడులే లక్ష్యంగానే మావోయిస్టులు వీటిని అమర్చినట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో యాంటీ నక్సల్స్ బృందం, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఇవి బయటపడ్డాయి.

వర్షానికి గోతిలో చేరిన నీరు.. పైకి కనిపిస్తున్న పదునైన వెదురు బొంగులు

భూమికి పది అడుగుల లోతులో కందకాలు తవ్వి దానిలో వెదురు బొంగుల్ని.. సూది మొన మాదిరిగా చెక్కి అమర్చారు. వాటిపై ఆకులు కప్పి ఉంచారు. వీటిని పోలీసు బలగాలు ధ్వంసం చేశాయి.

గోతిలోంచి బయటకు తీసిన వెదురు బొంగులు

ఇదీ చూడండి:PAYYAVULA KESAV: ఆ సంక్షోభానికి ప్రధాన కారణం సీఎం జగనే: పయ్యావుల

ABOUT THE AUTHOR

...view details