మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. ఏవోబీ సరిహద్దులో మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యంలో అమరావతిలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయినట్లు ఆయన ప్రకటించారు. మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందన్నారు.
గత రెండేళ్లుగా గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని.. 19,919 కుటుంబాలకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ఆదివాసీ ప్రాంతాలకు చేరుతున్నాయని తెలిపారు. పోలీసులపై ఆదివాసీల అభిప్రాయాలు మారాయని.. హింస, రక్తపాతం ద్వారా అభివృద్ధి జరగదని వారు గుర్తించినట్లు వెల్లడించారు.