ACCIDENT: ఆగిఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న కోళ్ల వ్యాన్.. ఇద్దరు మృతి - ఏపీలో రోడ్డు ప్రమాదాలు
06:50 August 25
గాజువాకలో ప్రమాదం ఇద్దరు మృతి
విశాఖ ఎయిర్ పోర్ట్ -షీలా నగర్ మధ్య జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. వ్యాన్ డ్రైవర్‌కి గాయాలయ్యాయి. ఆనందపురం నుండి గాజువాక పరిధిలోని శ్రీహరిపురంలో ఉన్న స్టాక్ పాయింట్‌కి వ్యాన్‌లో కోళ్లు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఎయిర్ పోర్ట్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. వ్యాన్ అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వ్యానులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. మృతులు విశాఖకు చెందినవారేనని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: INTER ANNUAL FEE: ప్రైవేటు జూనియర్ కళాశాలల వార్షిక ఫీజులు ఖరారు