ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Snake bite: ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. పసికందు మృతి! - పాముకాటుకు ముగ్గురు బలి

తెలంగాణలోని మహబుబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురిని విషసర్పం కాటు వేయగా.. మూడు నెలల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

SNAKE
SNAKE

By

Published : Nov 7, 2021, 1:50 PM IST

ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటు వేయడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందగా... చిన్నారి తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురంలో జరిగింది.

గ్రామానికి చెందిన క్రాంతి- మమత దంపతులు. వీరికి మూడు నెలల చిన్నారి ఉంది. పాప అనారోగ్య సమస్య కారణంగా కొన్ని రోజులుగా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో.. శనివారమే పాపను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి సమయంలో పాప నోటి నుంచి నురుగు రావడం గమనించిన తల్లిదండ్రులు.. కంగారుగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పాపను ఎత్తుకుని వెళ్తుండగా.. అప్పటి వరకు పాపకు కప్పి ఉంచిన దుప్పట్లోంచి జారిపడింది.

కింద పడిన పాము తల్లిదండ్రులు క్రాంతి, మమతను కాటు వేసింది. బంధువులు ఈ ముగ్గురినీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందింది. పాప తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆ పాపకు ఆరోగ్యం బాలేకపోతే ఖమ్మంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టారు. ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పాపకు కప్పిన చద్దరులో పాము ఉంది. మొదట పాపను కాటువేసింది. వెంటనే పాపను ఆస్పత్రికి తీసుకెళ్లాము. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. పాము కింద పడి.. ఆ పాప తండ్రిని కరిచింది. పాప అప్పటికే మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం అందించాలని కోరుతున్నాము. -స్థానికుడు

ఇదీ చూడండి:Police accident today: లారీని ఢీకొన్న పోలీసు వాహనం.. ఏఎస్సై పరిస్థితి విషమం

ABOUT THE AUTHOR

...view details