IMPRISONMENT: తప్పుడు పత్రాలు దాఖలు చేసి బ్యాంకును మోసగించిన కేసులో నేరం రుజువు కావడంతో పలువురు బ్యాంకు, రెవెన్యూ అధికారుల సహా 18 మంది నిందితులకు జైలు శిక్షతోపాటు, జరిమానా విధిస్తూ విశాఖలోని రెండో అదనపు ప్రత్యేక సీబీఐ కేసుల న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.వెంకటరమణ తీర్పునిచ్చారు. 2019 నవంబరులో అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, రెవెన్యూ అధికారులు, బినామీ రుణ గ్రహీతలు కలిసి బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు మంజూరు చేసుకుని రూ.13,21,000 నష్టాన్ని కలగజేశారు. సీబీఐ అధికారులు 2020లో ఆరు కేసులు నమోదు చేసి 18 మంది నిందితులను అదుపులోకి తీసుకుని సీబీఐ న్యాయస్థానంలో హాజరు పరిచారు.
బ్యాంకును మోసగించిన కేసులో.. 18 మందికి జైలుశిక్ష - అనంతపురం జిల్లా తాాజా వార్తలు
IMPRISONMENT: తప్పుడు పత్రాలు దాఖలు చేసి బ్యాంకును మోసగించిన కేసులో బ్యాంకు, రెవెన్యూ అధికారులు సహా 18 మందికి జైలు శిక్షతో జరిమానా విధించారు. ఈ మేరకు విశాఖలోని రెండో అదనపు ప్రత్యేక సీబీఐ కేసుల న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.వెంకటరమణ తీర్పునిచ్చారు.
నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులను శిక్షించారు. అప్పటి బ్రాంచి మేనేజరు జి.ఓబులేసుకు మూడేళ్ల జైలు, రూ.54 వేల జరిమానా, రుణ అధికారి డి.దక్షిణామూర్తికి మూడేళ్ల జైలు, రూ.40వేల జరిమానా, క్లర్కు కమ్ క్యాషియర్ సిహెచ్.బసవరాజుకు 3ఏళ్ల జైలు, రూ.26 వేల జరిమానా విధించారు. పెద్దపప్పూర్ మండలంలోని వివిధ పంచాయతీల కార్యదర్శులు తలారి లవకుమార్‌కు రెండేళ్ల జైలు, రూ.48 వేల జరిమానా, ఎ.వాసుదేవరావు, మరాటి సుభాంజీరావు, రామన్నగారి చలపతి నాయుడు, మండల రెవెన్యూ అధికారి సింగమల మహ్మద్ యూసఫ్ సహా బినామీ రుణ గ్రహీతలకు శిక్షలు పడ్డాయి.
ఇవీ చదవండి: