కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై చనిపోయి ఉన్న గేదెను తప్పించబోయిన టాటాఏస్ వాహనం.. కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ROAD ACCIDENT: గేదెను తప్పించబోయి.. కారును ఢీకొన్న వాహనం! - ఏపీలో తాజా రోడ్డు ప్రమాదాలు
రోడ్డుపై చనిపోయిన ఉన్న గేదెను తప్పించబోయిన ఓ టాటాఏస్ వాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
గేదెను తప్పించబోయి కారును ఢీకొన్న టాటాఏస్ వాహనం
విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు తెలంగాణలోని జనగామ జిల్లా నుంచి.. విజయవాడ దుర్గగుడికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి:Maha Padayathra: తొమ్మిదో రోజు మహా పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం