విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా.. లీగల్ అడ్వయిజరీ కమిటీ నియామకానికి, దిల్లీలో ఆన్‌లైన్ బిడ్డింగ్‌ను వ్యతిరేకిస్తూ.. కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కేంద్రం వైఖరికి నిరసనగా..విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎనిమిది గేట్ల వద్ద ఆందోళన నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ నినాదాలు చేశారు.
Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ 8 గేట్ల వద్ద కార్మికుల నిరసనలు - విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ముందు ఎనిమిది గేట్ల వద్ద కార్మికులు నిరసనలు చేపట్టారు.
ఉదయం 9 గంటలకు కార్మికులు లోపలకు వెళ్లాలి. కానీ ఆ సమయంలోనే నిరసన వ్యక్తం చేశారు. నిర్వాసితులు, కార్మికులు అన్ని గేట్ల ఎదుట నిరసన తెలిపారు. ఫలితంగా కార్మికులు స్టీల్ ప్లాంట్ లోపలకు వెళ్లలేక పోయారు. మెయిన్ గేట్, బీ, సీ గేట్ .. కాంట్రాక్టు కార్మికులు వెళ్లే గేట్, అడ్మిన్ బిల్డింగ్, రైల్వే గేట్, న్యూ గేట్, అన్ని గేట్లు వద్ద కార్మికులు, నిర్వాసితులు అడ్డుగా నిలుచుని కార్మికులను విధులకు వెళ్లకుండా అడ్డగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ సీహెచ్ నరసింగరావు, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, గుర్తింపు సంఘ అధ్యక్షుడు అయోద్య రామ్, వైసీపీటీసీ, టీఎన్టీయూసీ, డిఎంఎస్ సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి : PROTEST: 'వేధింపులు భరించకలేకపోతున్నాం.. ఆ అధికారిని బదిలీ చేయండి'