ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యూజెర్సీలో గాజువాక యువకుడు మృతి - newjersy

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విశాఖ యువకుడు మృతి చెందాడు. సరస్సులో విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. జీపీఎస్​పై నమ్మకంతో ఈతకు దిగి ఊబిలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. అవినాష్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకు రావాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

'న్యూజెర్సీలో గాజువాక యువకుడు మృతి'

By

Published : Jun 4, 2019, 4:11 PM IST

'న్యూజెర్సీలో గాజువాక యువకుడు మృతి'

అమెరికాలో గాజువాకకు చెందిన యువకుడు మృతి చెందాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అవినాష్ న్యూజెర్సీలోని స్థానిక సరస్సులో విహార యాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. అవినాష్ తండ్రి వెంకటరావు విశాఖ స్టీల్‌ ప్లాంట్​లో పని చేస్తున్నారు. అవినాష్ ఉన్నత చదువుల కోసం మూడేళ్ళ కిందట అమెరికాకు వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

ముంచిన జీపీఎస్....
రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లిన అవినాష్​ను జీపీఎస్ తప్పుదారి పట్టించింది. ఈత కొట్టేందుకు అనుకూలంగా లేని ప్రాంతంలో సురక్షితమని జీపీఎస్ సమాచారం ఇవ్వటంతో సరస్సులోకి దిగిన అవినాష్​.. ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.

ఇవీ చూడండి-నేటి నుంచే డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details