విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేసి.. నినాదాలు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కూర్మన్నపాలెం నుంచి బైక్ ర్యాలీ..
ప్రజల కష్టాలు తెలుసుకోలేని పాలకులు అధికారం నుంచి తప్పుకోవాలని విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. చేస్తున్న పోరాటం వంద రోజులైన సందర్భంగా కార్మిక సంఘాలు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, కార్మికసంఘాల నేతలు కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా తరలివచ్చారు. జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద మహాసభ నిర్వహిస్తున్నారు.