ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మృత్యువును జయించి...వ్యాపారవేత్తగా రాణిస్తున్న విశాఖ మహిళ

చిన్న బాధలకే అత్మహత్యలకు పాల్పడే వారికి ఆమె జీవితం ఓ పాఠం. రెండు కిడ్నీలు పాడైపోయి మరణం అంచుదాకా వెళ్లారు. ఒక దశలో ఆత్మహత్యే శరణ్యమని యత్నించిన ఆమెకు.. తల్లి కిడ్నీ దానం గుర్తుకు వచ్చి బతకాలనుకున్నారు. ఒకప్పుడు మందుల ఖర్చులకు పాతికవేలు సంపాదిస్తే చాలనుకున్న ఆమె... ఎందరికో ఉపాధి కల్పిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

Visakha woman who conquered death and became a businessman
వ్యాపారవేత్తగా రాణిస్తోన్న హరిత

By

Published : Oct 4, 2020, 11:56 AM IST

మృత్యువును జయించి...వ్యాపారవేత్తగా రాణిస్తున్న విశాఖ మహిళ
విశాఖలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ హరిత. తండ్రి షిప్‌యార్డులో కార్మికుడు. అంతా సవ్యంగా సాగిపోతున్న ఆమెకు డిగ్రీ రెండో ఏడాదిలో రెండు కిడ్నీలు పాడయిపోయాయని తెలిసింది. అసలు బతికే అవకాశం లేదని.. కిడ్నీ మార్పిడి తప్ప వేరే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. కూతురు కోసం తల్లి కిడ్నీ ఇవ్వడంతో...2003లో రూ.5 లక్షలు ఖర్చు చేసి శస్త్ర చికిత్స చేయించారు. నెలనెలా మందులకయ్యే రూ.25 వేలు సంపాదించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు హరిత. హివాగా అనే సంస్థను స్థాపించి.... ఎందరికో ఉపాధి కల్పించారు.

మూడుసార్లు ఆత్మహత్యకు పురిగొల్పిన స్థితి నుంచి...

మహిళల కోసం హివాగా అనే సంస్థను స్థాపించింది హరిత. అన్ని రకాల అధునాతన పద్ధతులతో అందంగా కన్పించాలనుకున్న వారికి... చికిత్సలు అందిస్తున్నారు. సౌందర్యంగా తీర్చిదిద్దేందుకు శాస్త్రీయంగా, పూర్తిగా వైద్య పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నారు. మూడుసార్లు ఆత్మహత్యకు పురిగొల్పిన పరిస్థితుల నుంచి బయటపడి.. కొత్త లక్ష్యాలను సాధించగలిగారు.

25 మందికి తాను ఉపాధి కల్పించగలుగుతానని ఎన్నడూ అనుకోలేదని హరిత చెబుతున్నారు. పదిమందిని బతికించడం కోసం తనకు భవవంతుడు నిర్ణయించిన పనే హివాగా అని అంటున్నారు హరిత.

ఇదీ చదవండి:సాహస క్రీడలకు చిరునామా.. మన గండికోట

ABOUT THE AUTHOR

...view details