ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వర్షాలతో భయపడుతోన్న కొండవాలు ప్రాంత ప్రజలు - విశాఖ కొండవాలు ప్రాంతాలు తాజా వార్తలు

విశాఖ నగరంలో విశాలంగా పరుచుకున్న కొండలు కనువిందు చేస్తాయి. కానీ కొండలపై నివాసాలు ఉంటున్న వారికి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మట్టి కొండరాళ్లు ప్రమాద కరంగా మారాయి. అధికారులు , ప్రజాప్రతినిధలు కొండవాలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

visakha

By

Published : Oct 24, 2019, 11:05 PM IST

వర్షాలతో భయపడుతోన్న కొండవాలు ప్రాంత ప్రజలు

విశాఖ నగరంలో కొండవాలు ప్రాంత వాసులు వర్షాలతో సతమతమవుతున్నారు. భారీ వర్షాలతో అవస్థలు పడుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు వారిని భయపెడుతున్నాయి. విశాఖ ఉత్తర నియోజవర్గంలో ఉన్న కొండవాలు ప్రాంతాల్లో వైకాపా నియోజకవర్గ ఇంఛార్జి కెకె రాజు, విశాఖ మహా నగర పాలక సంస్ధ కమిషనర్ సృజన పర్యటించారు. జ్వరాలు ఉన్న ఇళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.

తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు... మాధవధార నుంచి కైలాసపురం కొండ ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల సమయంలో.. మట్టి జారిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. అటు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణబాబు పర్యటించి ప్రజలను పరామర్శించారు. కొండ వాలు ప్రాంతాలు ప్రమాదకరంగా ఉన్నాయని వాటి నుంచి దూరంగా ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details