విశాఖ జిల్లా పాడేరు మండలం బరిసింగికి చెందిన అరుణ... గర్భిణిగా ఉన్న సమయంలో ఎన్నో కష్టాలు పడింది. ఎనిమిదో నెల గర్భం ఉన్న సమయంలోనూ కుటుంబ పోషణ కోసం 15 కిలోల బరువున్న బంతిపూల గంపలను మోసుకుంటూ 5 కిలోమీటర్ల దూరంలోని సంతకు వెళ్లేది. అరుణ కష్టాలను ఈటీవీ, ఈటీవీ భారత్ వెలుగులోకి తెచ్చాయి. వరుస కథనాలతో ఆమె సమస్యలను ప్రపంచానికి తెలిసేలా చేశాయి.
స్పందించిన మహిళా కమిషన్ సభ్యులు
అరుణ గురించి తెలుసుకున్న మహిళా కమిషన్ సభ్యులు.... బరిసింగికి వెళ్లి ఆమెకు సీమంతం చేశారు. ప్రసవం సమయంలో ఆస్పత్రికి వెళ్లగా..... అరుణకు రక్తం సరిపడా లేదని వైద్యులు విశాఖలోని కేజీహెచ్‌కు సిఫార్సు చేశారు. అప్పుడు కూడా..... ఆమెకు మాజీ మంత్రి మణికుమారి ద్వారా కొంత ఆర్థిక సహాయం అందించి.... అధికారుల సాయంతో రక్తం అందేలా చేసింది ఈటీవీ భారత్. నవంబర్ 30న ఆమె పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది.