ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జిల్లాలో 5 రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, నేవీ, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం చేరుకున్న ఉపరాష్ట్రపతికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,డీజీపీ గౌతం సవాంగ్, నగర మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్టి, వి.ఎస్.ఎమ్ తదితర అధికారులు స్వాగతం పలికారు.
venkaiah naidu: విశాఖకు చేరుకున్న ఉపరాష్ట్రపతి - Vice President Venkaiah Naidu latest news
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu) విశాఖకు చేరుకున్నారు . విశాఖలో 5 రోజుల పాటు పర్యటించనున్నారు.
venkaiah naidu