- వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో పసిడి.. 300కేజీలు ఎత్తిన 19ఏళ్ల యువ జవాన్
Commonwealth games Jeremy Won Gold Medal: కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. వెయిట్‌లిఫ్టింగ్ 67 కిలోల కేటగిరీలో జెరెమీ లాల్రిన్నుంగా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.
- సోమవారం నుంచి సినిమా షూటింగ్‌లు బంద్
తెలుగు సినీ పరిశ్రమలో సోమవారం నుంచి రెడీ, కెమెరా, యాక్షన్ మాటలకు బ్రేక్ పడనుంది. సినిమా షూటింగ్‌లు నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి ఆదివారం ప్రకటించింది. నిర్మాణ వ్యయం, ఓటీటీలకు కొత్త సినిమాలు ఇవ్వడం, నటీనటుల పారితోషికాలు, కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లతో సతమతమవుతున్న నిర్మాతలు చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
- చిత్రావతి నదిలో కొట్టుకుపోయిన ఆటో.. డ్రైవర్ గల్లంతు
Auto Washed away.. Driver missing: ఎగువ ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది. వరద ఉద్ధృతితో శ్రీ సత్యసాయి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సుబ్బారావుపేట నుండి కొడికొండ వైపు వస్తున్న ఆటో.. నది ప్రవాహాన్ని దాటే క్రమంలో కొట్టుకుపోయింది.
- రాజ్యాంగం అందరికీ అర్థమయ్యేలా.. రావిశాస్త్రి రచనలు: జస్టిస్ ఎన్వీ రమణ
JUSTICE NV RAMANA: రావిశాస్త్రి.. తన సాహిత్యంలో న్యాయవ్యవస్థపై విపులంగా చర్చించారని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విశాఖలోని అంకోసా హాల్లో రావిశాస్త్రి శతజయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావిశాస్త్రి శతజయంతి ప్రత్యేక సంచిక విడుదల చేశారు. న్యాయవ్యవస్థ తీరుపై.. రావిశాస్త్రి చేసిన రచనల గురించి వివరించారు.
- వరద బాధితులకు సాయం పెంచాలి.. సీఎస్‌కు చంద్రబాబు లేఖ
Chandrababu letter to CS: గోదావరి వరద బాధితుల కష్టాలు, పోలవరం నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గోదావరి వరదలు వేల కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయని.. ఇళ్లు మునిగిపోయి, కూలిపోయి భారీ నష్టం జరిగిందన్న చంద్రబాబు.. ప్రభుత్వ సాయం పెంచాలని లేఖలో కోరారు.
- "నా బండికే డ్యాష్ ఇస్తావా..? నీ అంతు చూస్తా".. బస్సు డ్రైవర్‌పై మహిళ దాడి
WOMAN ATTACK: ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు పెరుగుతున్నాయి. బండి పక్కకు తీయమన్నందుకు కొందరు.. నన్నే దాటేస్తావా అని మరికొందరు అసభ్యపదజాలంతో దూషించడం లాంటివి ఎక్కువవుతున్నాయి. గత నెలలో విజయవాడలో ఓ ఇద్దరు యువకులు బస్సు డ్రైవర్‌పై దాడి మరువకముందే.. మరో మహిళ హల్చల్ చేసింది.
- 'సారీ అమ్మ, నాన్న.. అతడ్ని ప్రేమించా.. ఇక నా వల్ల కాదు'.. యువకుడి సూసైడ్ లెటర్
రాజస్థాన్‌లోని కోటాలో స్వలింగ సంపర్క సమస్యలతో 16ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు.. స్నానం కోసం కుంటలో దిగిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి మరణించారు. ఈ దారుణ ఘటన అదే రాష్ట్రంలోని శ్రీగంగానగర్‌లో జరిగింది.
- శివసేన నేత సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ
Sanjay raut ed: శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. మరింత లోతైన విచారణ కోసం రౌత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు.
- ఐటీ రిటర్నుల వెల్లువ.. ఒకేరోజు 45లక్షలు.. గంటలో 5లక్షలకు పైగా..
ITR filing 2022: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు చివరి రోజు కావడం వల్ల.. పన్ను చెల్లింపుదారులు ఐటీ పోర్టల్‌కు పోటెత్తారు. ఆదివారం రికార్డు స్థాయిలో తమ రిటర్నులు దాఖలు చేశారు. గంట వ్యవధిలోనే 5.17 లక్షల మంది ఐటీఆర్‌లు దాఖలు చేశారు.
- భగభగ మండుతూ.. భూమిపైకి దూసుకొచ్చిన చైనా రాకెట్ శకలాలు
China Rocket Crash: ప్రపంచ దేశాలకు చైనా ఏదో ఒక రూపంలో సమస్యలు సృష్టిస్తూనే ఉంది. కరోనా పుట్టుకకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న డ్రాగన్ దేశం.. ఇటీవల లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ వైఫల్యంతో కొత్త చిక్కులు తీసుకొచ్చింది. చైనా రాకెట్ శకలాలు భగభగ మండుతూ శనివారం అర్ధరాత్రి భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. నాసా సహా అంతరిక్ష శాస్త్ర నిపుణులను ఆందోళనకు గురిచేశాయి.