విశాఖ జీవీఎంసీ ఎన్నికల బరిలో టికెట్ ఆశించి భంగపడిన తెదేపా నాయకులు రాజీనామా బాట పట్టారు. 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్, తెదేపా జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి దొడ్డి రామనంద్ సహా వారి అనుచరులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాము పార్టీ కోసం పని చేస్తున్నా తగిన గుర్తింపు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల వేళ.. పెరుగుతున్న రాజీనామాల పర్వం
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న పార్టీ కార్యకర్తలకు టికెట్ దక్కపోవడంతో రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విశాఖ జీవీఎంసీ 31వ వార్డు తెదేపా నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మున్సిపల్ ఎన్నికల వేళ పెరుగుతున్న రాజీనామాల పర్వం