అధికార పార్టీ ఆక్రమణలతో కుచించుకుపోయి విశాఖపట్టణం.. విజయసాయి పట్టణమైపోతుందేమోననే ఆందోళనగా ఉందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. పులివెందుల పంజాకి విశాఖ విలవిల్లాడుతోందని మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు... వైకాపా నేతల తీరును దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మనుషులకు రూ.10 కోట్లు ఇవ్వకపోడంతో రూ.100 కోట్ల భూములు లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో విజయసాయిరెడ్డి మకాం వేసినప్పుడే ఉత్తరాంధ్రకు ఉపద్రవం ముంచుకొచ్చిందని ఎద్దేవా చేశారు. దేవుడే విశాఖని కాపాడాలని వారు అన్నారు.
'విశాఖ.. విజయసాయిరెడ్డి పట్టణం అవుతుందేమో..!'
పరిపాలనా రాజధాని పేరుతో విశాఖను పంచుకు తినేందుకు పులివెందుల పంచెలు దిగాయని తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. భూములపై పంచాయతీలు మొదలయ్యాయని విమర్శించారు. 'రూ.10 కోట్లిస్తారా.. సీఎంకు చెప్పి లాక్కోమంటావా' అంటూ దందాకు తెర తీశారని మండిపడ్డారు.
tdp-leaders-fire-on-ysrcp