ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఎస్సీ యువకుడి శిరోముండనాన్ని ఖండించిన తెదేపా

విశాఖ జిల్లా పెందుర్తిలో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మాజీ మంత్రి జవహర్​ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

By

Published : Aug 29, 2020, 4:32 AM IST

విశాఖ ఎస్సీ యువకుడి శిరోముండనాన్ని ఖండించిన తెదేపా
విశాఖ ఎస్సీ యువకుడి శిరోముండనాన్ని ఖండించిన తెదేపా

ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీలను పోలీస్ స్టేషన్లలో శిరోముండనం చేయించి, కొట్టి చంపేస్తుంటే బయట రక్షణ ఏముంటుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఎస్సీ యువకుడు వరప్రసాద్​కి శిరోముండనం, కిరణ్​ని పోలీసులు కొట్టి చంపిన రోజే కఠినంగా వ్యవహరించి ఉంటే విశాఖ జిల్లా పెందుర్తిలో మరో ఎస్సీ యువకుడు శ్రీకాంత్​కి శిరోముండనంతో అవమానం జరిగి ఉండేది కాదన్నారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. శ్రీకాంత్​పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎంతటి వారైనా కఠినంగా శిక్షించండి : జవహర్​

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు జీవించే హక్కు లేదా అంటూ మాజీ మంత్రి జవహర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్​లో ఎస్సీ యువకుడు వరప్రసాద్​కి శిరోముండనం చేసిన రోజే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటే మరో శిరోముండనం ఘటన జరిగి ఉండేది కాదన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎస్సీ యువకుడు శ్రీకాంత్​కి శిరోముండనం చేసిన ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శిరోముండనం వెనుక ఎంతటి పెద్ద వారు ఉన్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వరుసగా ఎస్సీలపై జరుగుతున్న దాడులు, శిరోముండనం, హత్యలపై న్యాయ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

ఇదీ చదవండి :విశాఖలో దారుణం... ఎస్సీ యువకుడికి శిరోముండనం..!

ABOUT THE AUTHOR

...view details