చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై దురుసుగా ప్రవర్తించిన వైకాపా సర్పంచ్ కాథ సూర్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని తెదేపా భీమునిపట్నం మండల అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. అధికారులు స్వాధీన పరుచుకున్న వాహనాలను.. వారి అనుమతి లేకుండానే ఎత్తుకెళ్లారని ఆరోపించారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నారాయణరాజుపేట ఎర్ర చెరువులో.. పట్టపగలే దర్జాగా సాగిస్తున్న అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"అధికారులతో దురుసుగా ప్రవర్తించిన.. నారాయణరాజుపేట సర్పంచ్‌ను అరెస్ట్ చేయాలి" - బీమునిపట్నంలో అక్రమ తవ్వకాలు
అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులతో.. దురుసుగా ప్రవర్తించిన నారాయణరాజుపేట సర్పంచ్‌ను అరెస్టు చేయాలని తెదేపా భీమునిపట్నం మండల అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. మండల స్థాయి నాయకులు కనుసన్నల్లోనే గ్రావెల్, రాళ్లు, ఇసుక అక్రమ దందా సాగుతోందని ఆరోపించారు.
అక్రమ తవ్వకాలు
అడ్డుకున్న రెవెన్యూ అధికారులను కాథ సూర్యనారాయణ దూషించారని మండిపడ్డారు. వార్త ప్రచురించవద్దని వైకాపా మండల స్థాయి నాయకులు మీడియాను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మండల స్థాయి నాయకుల కనుసన్నలలోనే ఈ అక్రమ దందా సాగుతోందన్నారు. కొండలు, గుట్టలు, చెరువులు అనే తేడా లేకుండా వనరులను కొల్లగొట్టి.. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారన్నారు.
ఇవీ చదవండి: